బిట్స్ ప్రాంగణాన్ని అమరావతిలో ఏర్పాటు కోసం 70 ఎకరాలను కేటాయిస్తూ సోమవారం కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నామని ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. మంగళవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తర సమయంలో మంత్రి మాట్లాడుతూ..డీప్ టెక్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రణాళిక చేస్తున్నారని, విశాఖలో AI యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా ఏపీ ప్రైవేటు విశ్వ విద్యాలయాల సవరణ బిల్లు-2025ను మంత్రి లోకేష్ సభలో ప్రవేశపెట్టారు. 2016లో ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లును తీసుకొచ్చామని, అందులో కొన్ని లోపాలు ఉన్నాయని, వాటిని సరిదిద్ది సరికొత్త చట్టాలను తెస్తాం మంత్రి లోకేష్ వెల్లడించారు.
![]() |
![]() |