2025 ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ జట్టు ఎలా ఉండబోతుందో దాని బ్యాట్స్‌మన్ శశాంక్ సింగ్ ముందుగానే అంచనా వేసాడు. శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలో PBKS, తమ మొదటి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. అయితే, శశాంక్ చేసిన జట్టు ఎంపికలో కొన్ని ఆశ్చర్యకరమైన మార్పులు కనిపించాయి, ముఖ్యంగా ఫామ్‌లో ఉన్న ఆల్-రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్‌ను జట్టులోకి తీసుకోకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. తన యూట్యూబ్ ఇంటర్వ్యూలో, ఓపెనింగ్ బ్యాటర్‌గా జోష్ ఇంగ్లిస్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌లను ఎంపిక చేశాడు. మూడో స్థానంలో PBKS కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఉంటాడని పేర్కొన్నాడు. నాలుగో స్థానంలో ఆస్ట్రేలియా స్టార్ ఆల్-రౌండర్ మార్కస్ స్టోయినిస్, ఐదో స్థానంలో గ్లెన్ మాక్స్‌వెల్ ఉంటారని తెలిపాడు. గత సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న శశాంక్ సింగ్ తన స్థానాన్ని ఆరో నెంబర్ వద్ద భద్రపరచుకున్నాడు. శశాంక్ తర్వాత ఏడో స్థానంలో నెహాల్ వధేరా ఉంటారని చెప్పాడు. కానీ, ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురిచేసిన విషయం ఏంటంటే, ఒమర్జాయ్ స్థానంలో దక్షిణాఫ్రికా సీమ్-బౌలింగ్ ఆల్-రౌండర్ మార్కో జాన్సెన్‌ను ఎంపిక చేయడం. ఒమర్జాయ్ ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. మూడు మ్యాచ్‌ల్లో 126 పరుగులు చేయడంతో పాటు ఏడు వికెట్లు పడగొట్టాడు. స్పిన్ విభాగంలో హర్‌ప్రీత్ బ్రార్, యుజ్వేంద్ర చాహల్ స్థానం దక్కించుకోగా, పేస్ విభాగంలో ప్రధాన బౌలర్‌గా అర్ష్‌దీప్ సింగ్‌ను ఎంపిక చేశాడు.
PBKS ప్లేయింగ్ ఎలెవన్ అంచనా : జోష్ ఇంగ్లిస్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (WK), శ్రేయాస్ అయ్యర్ (C), మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, శశాంక్ సింగ్, నెహాల్ వధేరా, మార్కో జాన్సెన్, హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్
![]() |
![]() |