సోమందేపల్లి మండలంలోని పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని గర్భిణీలకు అన్నదానం నిర్వహించారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలకు అన్నదానం చేశారు.
జామీయా మసీదు ముతువల్లి మహమ్మద్, కార్యదర్శి అక్రం మాట్లాడుతూ ప్రతి పుణ్య కార్యానికి, దాన ధర్మాలకు అల్లా కరుణిస్థాడని, అందుకే సృష్టికి మూలమైన అమ్మకు అన్నదానం చేపట్టామన్నారు, ప్రభుత్వ వైద్యులు ఓంకార్ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
![]() |
![]() |