ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాంగ్రెస్‌ ఆఫర్‌కు నో చెప్పిన మాజీ ప్రధాని!

national |  Suryaa Desk  | Published : Mon, Mar 11, 2019, 11:09 AM

 మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌.. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారా? అంటే లేదనే సంకేతాలు వెలువడుతున్నాయి. పంజాబ్‌ కాంగ్రెస్‌ యూనిట్‌.. మన్మోహన్‌కు పెద్ద ఆఫరే ఇచ్చినట్లు తెలుస్తోంది. అమృత్‌సర్‌ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పోటీ చేయాలని మన్మోహన్‌కు చెప్పినప్పటికీ ఆయన సుముఖంగా లేరని సమాచారం. 86 ఏళ్ల మన్మోహన్‌ సింగ్‌.. కాంగ్రెస్‌ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించినట్లు విశ్వసనీయ సమాచారం.2009 సాధారణ ఎన్నికల సమయంలోనూ అనారోగ్య సమస్యల వల్ల లోక్‌సభకు పోటీ చేయలేదు. 2014 సాధారణ ఎన్నికల్లో అమృత్‌సర్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరపున అమరీందర్‌ సింగ్‌ పోటీ చేసి గెలిచారు. అయితే 1991 నుంచి అసోం నుంచి మన్మోహన్‌ సింగ్‌ రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్నారు. మన్మోహన్‌ రాజ్యసభ పదవీ కాలం ఈ ఏడాది జూన్‌ 14తో ముగియనుంది. ఇప్పటి వరకు మన్మోహన్‌ లోక్‌సభకు ఎన్నిక కాలేదు. 1999లో కాంగ్రెస్‌ తరపున దక్షిణ ఢిల్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు మన్మోహన్‌ సింగ్‌.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa