ఇథియోపియా దేశంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. మెకెల్లే ప్రాంతానికి చెందిన మెధిన్ హాగోస్ అనే మహిళ 76 సంవత్సరాల వయసులో మగబిడ్డకు జన్మనిచ్చింది.
తాను సహజంగానే గర్భం దాల్చానని ఆమె సోషల్ మీడియాలో పేర్కొంది. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుండగా, చాలా మంది నెటిజన్లు ఇంత ఆలస్యంగా సహజంగా గర్భం దాల్చడం సాధ్యం కాకపోవచ్చునని చెబుతున్నారు. ఆమె ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చి ఉండే అవకాశం ఉందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
![]() |
![]() |