ఐపీఎల్ ఫీవర్ మొదలైంది. అన్ని జట్లు ఇప్పటికే సిద్ధం కాగా మార్చి 22న ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌తో ఈ సీజన్ ఆరంభం కానుంది. మొదటి మ్యాచ్ కంటే అందరూ చెన్నై-ముంబై మధ్య జరగనున్న పోరు కోసమే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చెన్నై చేరుకున్న ముంబై ఇండియన్స్‌కు అక్కడి ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు. చెన్నైలో అడుగుపెట్టగానే తిలక్ వర్మ వనక్కం చెన్నై అంటూ వీడియోతో ఫ్యాన్స్‌కు హాయ్ చెప్పాడు.
ఈ ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టు తన తొలి మ్యాచ్‌ని చెపాక్ స్టేడియం వేదికగా చెన్నైతో ఆడనుంది. మ్యాచ్ కోసం ముంబై ఇండియన్స్ స్క్వాడ్ చెన్నైకి చేరుకుంది. ఫ్లయిట్‌లో చెన్నైకి చేరుకున్న ముంబై ఇండియన్స్ టీమ్‌కి అక్కడి అభిమానులు ఘన స్వాగతం పలికారు. హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ లాంటి స్టార్స్‌తో కూడిన ముంబై జట్టు ఈ ఐపీఎల్‌లో చాలా బలంగా ఉంది.
చెన్నైకి చేరుకోగానే తిలక్ వర్మ వీడియోను ముంబై ఇండియన్స్ తన అధికారిక సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వనక్కం చెన్నై.. మేము ఇక్కడికి వచ్చాము.. త్వరలోనే కలుసుకుందాం అంటూ సీఎస్కేకి తిలక్ వర్మ హాయ్ చెప్పాడు. తెలుగోడు తిలక్ వర్మ ముంబై ఇండియన్స్ జట్టులో ఆడి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఐపీఎల్‌లో హార్డ్ హిట్టర్‌గా పేరు తెచ్చుకున్న తిలక్ వర్మ టీమిండియా టీ20 స్క్వాడ్‌లో కూడా తన ప్లేస్‌లో ఫిక్స్ చేసుకున్నాడు.
మార్చి 23 రాత్రి 7 గంటలకు చెన్నై సూపర్ కింగ్స్ - ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ చరిత్రలో చెన్నైపై ఎక్కువ మ్యాచ్‌లు గెలిచిన జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. ఈ రెండు జట్లు 37 మ్యాచ్‌లు ఆడగా చెన్నై 17 మాత్రమే గెలవగా, ముంబై ఇండియన్స్ 20 మ్యాచ్‌లలో విజయం సాధించింది. 2012 తర్వాత ముంబై ఇండియన్స్ తాను ఆడిన తొలి మ్యాచ్‌లో ఇప్పటి వరకూ గెలవలేదు. సీఎస్కేపైనే ఎక్కువగా ఓడిపోయింది. మరి ఈ ఏడాది జరిగే మ్యాచ్‌లో ఏవిధంగా రాణిస్తుందో చూడాలి.
హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, రోబిన్, ర్యాన్ రికెల్టన్, సృజిత్ కృష్ణన్, బేవాన్ జాకబ్స్, తిలక్ వర్మ, నమన్ ధీర్, విల్ జాక్స్, మిచెల్ శాన్‌ట్నర్, రాజ్ అంగడ్ బవా, విఘ్నేశ్ పుతుర్, కార్బన్ బోష్, ట్రెంట్ బౌల్ట్, కరణ్ శర్మ, దీపక్ చాహర్, అశ్వినీ కుమార్, టాప్‌లే, సత్యనారాయణ పెన్మత్స, అర్జున్ టెండూల్కర్, ముజీబ్ అర్ రెహ్మాన్, జస్ప్రిత్ బుమ్రా
![]() |
![]() |