ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అఖిలపక్ష సమావేశానికి హాజరుకాని టీడీపీ, జనసేన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 23, 2025, 10:44 AM

నియోజకవర్గాల పునర్విభజనపై చెన్నైలో డీఎంకే నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి టీడీపీ, జనసేన హాజరు కాలేదు. ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా మార్చి 12న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివా్‌సను తమిళనాడు మంత్రి ఈవీ వేలు ఆహ్వానించారు. ఎన్డీయే భాగస్వామ్యపక్షంగా ఉన్నందున ఆ సమావేశానికి హాజరుకాలేమని అప్పుడే పల్లా స్పష్టం చేశారు. తనకు అందిన ఆహ్వానంపై జనసేన స్పందిస్తూ... వేర్వేరు కూటముల్లో ఉన్నందున హాజరుకాలేమని పేర్కొంది. ‘నియోజకవర్గాల పునర్విభజనపై ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. ఈ అంశంపై మా విధానం మాకు ఉంది. మా విధానాన్ని సాధికారిక వేదికపై వెల్లడిస్తాం’ అని జనసేనానికి రాజకీయ కార్యదర్శి పి.హరి ప్రసాద్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa