ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌పై ఏపీ బీజేపీ నేత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ సోము వీర్రాజు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 23, 2025, 05:53 PM

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్)పై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఓ గుంటనక్క అని.. పదేళ్ల పాటు తెలంగాణను పాలించిన ఆయన తన కుటుంబ అభివృద్ధిని మాత్రమే చూసుకున్నారని విమర్శించారు. రాత్రిపూట నిద్రపోకుండా ఊగిపోయే గుంటనక్క అని ధ్వజమెత్తారు. శనివారం ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో బీఆర్ఎస్ నాయకులతో సమావేశమైన కేసీఆర్?. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పొత్తు లేకుంటే చంద్రబాబు నాయుడు కూడా గెలిచేవారు కాదని, కానీ, తెలంగాణలో మళ్లీ మనమే ఒంటరిగా అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


ఈ వ్యాఖ్యలకు తాజాగా సోము వీర్రాజు కౌంటర్ ఇచ్చారు. పదేళ్లు అధికారంలో ఉండి.. మాటలతో సరిపెట్టారని బీజేపీ ఎమ్మెల్సీ మండిపడ్డారు. తెలంగాణలోనూ తామే అధికారంలోకి వస్తామని జోస్యం చెప్పారు. కేవలం తన కొడుకు కేటీఆర్ , కూతురు కవిత, మేనల్లుడి హరీశ్ రావుల కోసమే ఆయన తాపత్రయమంతా అని బీజేపీ నేత దుయ్యబట్టారు. అయితే, పొత్తువల్లే చంద్రబాబు గెలిచారని కేసీఆర్ అన్నారంటే.. బీజేపీ, జనసేనలు లేకపోతే అధికారం వచ్చేది కాదనే కదా అర్దం. బీజేపీని బీఆర్ఎస్ చీఫ్ పొగిడినట్టే కదా. మరలాంటప్పుడు కేసీఆర్‌పై విమర్శలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? చంద్రబాబు అంటే అంత ప్రేమ ఒలకబోస్తున్నారేంటి? అని చెవులు కొరుక్కుంటున్నారు.


కానీ, లోక్‌సభ నియోజకవర్గాల డీలిమిటేషన్ అంశంపై తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ శనివారం చెన్నైలోని నిర్వహించిన సమావేశానికి బీఆర్ఎస్ తరఫున కేటీఆర్ హాజరైన విషయం తెలిసిందే. ఇదే సోముకు ఆగ్రహం తెప్పించి ఉండొచ్చు. స్టాలిన్ సమావేశాన్ని కూడా ఎమ్మెల్సీ వీర్రాజు ప్రస్తావించారు. డీలిమిటేషన్ పేరుతో డీఎంకే కొత్త నాటానికి తెరతీసిందని అన్నారు. అంటే, కేసీఆర్‌పై సోము అక్కసుకు.. డీఎంకే భేటీకి కేటీఆర్ వెళ్లినందుకేనా? అని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.


కాగా, అవినీతిపై పోరాటం అంటూ.. కేసీఆర్ కుటుంబ పాలనపై విమర్శలు గుప్పిస్తూ తాము ప్రజల పక్షాన ఉన్నట్లు చూపించడంలో వ్యూహంలో భాగమే సోము వీర్రాజు వ్యాఖ్యలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీని వెనుక ఉన్న ఆంతర్యమిదేనని,. తెలంగాణ రాజకీయాల్లో కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చాయని అంటున్నారు. అయితే, ఇటీవల బీజేపీ-బీఆర్ఎస్ మధ్య పరస్పర విమర్శలతో రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరింత సూచనలు కనిపిస్తున్నాయి ఇక, డీఎంకే‌పై కూాడా సోము వీర్రాజ్ ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. డీఎంకే ఎక్కువ కాలం ఉండదని, తమ ముందు ఎగిరే రాష్ట్రాలు కూడా ఉండవని, మీరు కూడా ఉండరని బీజేపీ నేత ఆగ్రహం వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com