ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు శుభారంభం చేసింది. శనివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచులో..7 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై విజయం సాధించింది. 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ.. మరో 22 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించింది. విరాట్ కోహ్లీ (36 బంతుల్లో 59 నాటౌట్), ఫిలిప్ సాల్ట్(31 బంతుల్లో 56 రన్స్) హాఫ్ సెంచరీలతో చెలరేగిపోయారు.
విరాట్ కోహ్లీ రికార్డు..
ఈ మ్యాచ్ ద్వారా తన కెరీర్‌లో విరాట్ కోహ్లీ 400వ టీ20 మ్యాచ్ ఆడాడు. టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ తర్వాత.. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు విరాట్ గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి టీ20లకు దూరంగా ఉన్న కోహ్లీ.. ఐపీఎల్ బరిలోకి దిగాడు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే సత్తాచాటాడు. ఛేజింగ్‌లో సత్తాచాటి.. తననెందుకు అందరూ ఛేజ్ మాస్టర్ అంటారో మరోసారి నిరూపించాడు.
ఈ మ్యాచ్ ద్వారా విరాట్ కోహ్లీ.. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుపై 1000 పరుగులను స్కోరు చేశాడు. ఈ క్రమంలోనే నాలుగు జట్లపై 1000కి పైగా స్కోరు నమోదు చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌కు ముందు కోల్‌కతాపై విరాట్ చేసిన రన్స్.. 962గా ఉన్నాయి. మరో 38 పరుగులు చేసిన కోహ్లీ.. కేకేఆర్‌పై వెయ్యి పరుగుల మార్కును దాటేశాడు. అంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ కింగ్స్‌పై కూడా కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు.
ఇక ఐపీఎల్‌లో అత్యధిక జట్లపై వెయ్యికి పైగా స్కోర్లు నమోదు చేసిన బ్యాటర్లలో కోహ్లీ తర్వాత డేవిడ్ వార్నర్, రోహిత్ శర్మలు ఉన్నారు. వీరిద్దరూ రెండేసి జట్లపై ఈ ఫీట్ సాధించారు. డేవిడ్ వార్నర్ పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌పై వెయ్యికి పైగా పరుగులు చేశాడు. రోహిత్ శర్మ.. కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లపై ఈ ఫీట్ సాధించాడు. శిఖర్ ధావన్ చెన్నై సూపర్ కింగ్స్‌పై వెయ్యి పరుగులు స్కోరు చేశాడు
![]() |
![]() |