హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో టిటిడి నిర్మించిన శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ, మహాకుంభాభిషేకం కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. మార్చి 12వ తేదీన మంగళవారం ఉదయం బింబవాస్తు, నవకలశ స్నపనం, చతుర్దశ కలశ స్నపనం, హోమం, పూర్ణాహుతి, మహాశాంతి తిరుమంజనం, మహాశాంతి పూర్ణాహుతి, రక్షాబంధనం, కుంభారాధనం, నివేదనం, శయనాధివాసం, హౌత్రం, సర్వదేవతార్చన, హోమం నిర్వహిస్తారు.
మహాకుంభాభిషేకం : మార్చి 13వ తేదీ బుధవారం ఉదయం 6 నుండి 7.30 గంటల నడుమ మీన లగ్నంలో మహాకుంభాభిషేకం నిర్వహిస్తారు. ఆ తరువాత ఉదయం 7.30 నుండి 9 గంటల వరకు బ్రహ్మఘోష, వేదశాత్తుమొర, ధ్వజారోహణం, అర్చక బహుమానం, ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు నిత్యకైంకర్యాల అనంతరం సాయంత్రం 4 గంటల వరకు సర్వదర్శనం కల్పిస్తారు. సాయంత్రం 4 నుండి 5.30 గంటల వరకు శ్రీనివాస కల్యాణం, సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు ఉత్సవమూర్తుల ఊరేగింపు, ధ్వజావరోహణం, సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు నిత్య కైంకర్యాలు, రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు సర్వదర్శనం, రాత్రి 8.45 గంటలకు ఏకాంత సేవ నిర్వహిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa