శ్రీవారి అన్నప్రసాదం ట్రస్టుకు భారీ విరాళం అదింది. విజయవాడకు చెందిన ఎన్.శ్రీరామ్ ప్రసాద్ రూ.10,01,116 విరాళంగా ఇచ్చారు. కాకినాడకు చెందిన ఎలైట్ ఇన్‌స్ట్రుమెంట్ మేనేజింగ్ పార్ట్‌నర్ సూర్య నారాయణ రెడ్డి రూ.6,66,000 డొనేట్ చేశారు. దాతలు విరాళం డీడీలను తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడుకు అందజేశారు.రూ.5 వేల కోట్ల పైగా అంచనాలతో రూపొందించిన 2025-26 వార్షిక బడ్జెట్ కు టీటీడీ పాలకమండలి ఆమోదం తెలిపింది. టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు అధ్యక్షతన స్థానిక అన్నమయ్య భవన్ లో సమావేశమైన టీటీడీ పాలకమండలి పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. పాలకమండలి సమావేశం ముగిసిన అనంతరం బి.ఆర్. నాయుడు మీడియాతో మాట్లాడుతూ 2024-25 వ సంవత్సరానికి సంబంధించి 5179.85 కోట్లతో సవరణ బడ్జెట్ కి బోర్డు ఆమోదం తెలిపిందన్నారు. అలిపిరి వద్ద వున్న 35.24 ఎకరాల ప్రభుత్వ భూమితో పాటు 15 ఎకరాల టూరిజం భూమిని టీటీడీ స్వాధీనం చేసుకొని.. ప్రత్యామ్నాయంగా ప్రభుత్వానికి 50 ఎకరాల భూమిని మరో ప్రదేశంలో కేటాయించాలని తీర్మానించామన్నారు.
![]() |
![]() |