వైసీపీ అధినేత జగన్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. జగన్ కరుడుగట్టిన నేరస్థుడు అని, ఆయన్ని నమ్మితే జైలుకు పంపుతాడని వ్యాఖ్యానించారు. అవినీతి కేసుల్లో జైలుకెళ్లిన జగన్.. తనతోపాటు అనేక మందిని జైలుపాలు చేశాడని విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ నేర చరిత్ర ఉన్న పార్టీ అని దుయ్యబట్టారు. ఆ పార్టీతో పోరాటంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉండరాదన్నారు. ప్రతిరోజూ నేరాలు చేయడం వైసీపీకి అలవాటు అని నిప్పులు చెరిగారు. వాటిని కప్పిపెట్టడానికే మరిన్ని నేరాలు చేస్తున్నారని అన్నారు. నేరగాళ్ల ఆలోచనలు నేరాలు-ఘోరాల మీదే ఉంటాయని వ్యాఖ్యానించారు. సోమవారం పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడిన చంద్రబాబు.. త్వరలో జరగనున్న ఎన్నికల్లో కుట్రలు చేసి గెలవాలని వైసీపీ చూస్తోందని ఆరోపించారు. చరిత్రలో కుట్రదారులు గెలిచిన దాఖలాలు లేవన్నారు. ధర్మాన్ని ఏమార్చడం ఎవరి వల్లా కాదని, సత్యానికి ఉన్న శక్తి గొప్పదని పేర్కొన్నారు. ధర్మపోరాటంలో టీడీపీదే విజయం అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa