జనసేన కార్యకర్తలతో నటుడు నాగబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను జనసేన అభిమానిని మాత్రమేనని నాగబాబు అన్నారు. పవన్‌పై బంధుప్రీతి ముద్రవేస్తారనే జనసేనకు దూరంగా ఉన్నానని చెప్పారు. అధికారం ఉందని జనసేన కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
తాజాగా జనసేన తన అభ్యర్థుల ఎంపికపై కీలక ప్రకటన విడుదల చేసింది. 32 అసెంబ్లీ స్థానాలకు, 9 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారంటూ ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. ఏప్రిల్ 11న పార్లమెంట్, అసెంబ్లీలకు ఒకేసారి పోలింగ్ జరగనుండగా.. మే 23న ఫలితాలు వెలువడనున్నాయి
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa