ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెదేపా అసంతృప్తులకు బుజ్జగింపులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 11, 2019, 09:50 PM

పెండింగ్‌లో ఉంచిన తెదేపా అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. పాతపట్నం, గూడూరు, చీపురుపల్లి, గుడివాడ, పాయకరావుపేట, కొవ్వూరు, నిడదవోలు, అవనిగడ్డ నియోజకవర్గాల నేతలతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఇప్పటికీ పాతపట్నం, పాయకరావుపేట, కొవ్వూరు, చీపురుపల్లి నియోజక వర్గాలకు అభ్యర్ధులు ఖరారు కాలేదు. గూడూరు, గుడివాడ, అవనిగడ్డ, నిడదవోలులో ప్రకటించిన అభ్యర్ధులపై వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో వారిని బుజ్జగించే పనిలో అధినేత నిమగ్నమయ్యారు. పాతపట్నం సిట్టింగ్ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, పాయకరావుపేట సిట్టింగ్ ఎమ్మెల్యే అనిత, అవనిగడ్డ సిట్టింగ్‌ ఎమ్మెల్యే బుద్ద ప్రసాద్ వ్యతిరేకులను చంద్రబాబు బుజ్జగిస్తున్నారు. అసంతృప్తులను బుజ్జగించిన అనంతరం ఈరోజు లేదా రేపు ఆయా స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసే అవకాశముంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa