కాకినాడ సూర్యప్రధాన ప్రతినిధి : తూర్పు గోదావరిలో అధికార టీడీపీకి గట్టి షాక్ తగిలింది. కాకినాడ ఎంపీ తోట నరసింహం, ఆయన సతీ మణి తోట వాణి పార్టీకి గుడ్‌బై చెప్పనున్నారు. వారిరువురు బుధ వారం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ సంద ర్భంగా తోట వాణి మాట్లాడుతూ... టీడీపీలో తమకు దారుణమైన అన్యాయం జరిగిందని పేర్కొ న్నా రు. తన భర్తకు పార్టీలో సముచిత స్థానం ఇవ్వలేదని, ఆయన అనారోగ్య కారణాల దౄఎష్ట్యా తనకు అసెంబ్లీ టికెట్ కేటాయించాలని కోరినా చంద్ర బాబు నుంచి ఎటువంటి స్పందన రాలేదని వాపోయారు. వైఎస్సార్ సీపీలో తమకు సముచిత స్థానం కల్పిస్తామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారని, అందుకే ఆ పార్టీలో చేరుతున్నామని పేర్కొన్నారు.
మానవత్వం కూడా లేదా?:ఈ మధ్య చంద్రబాబు నుంచి కబురు వచ్చింది. నా భర్త అనారోగ్యం వల్ల వెళ్ళలేకపోయాం. ఈ విష యాన్ని మా జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులకు చెప్పాను. అప్పటి నుంచి జిల్లా టీడీపీ నేతలు కనీసం నా భర్తను పలకరించ లేదు. వాళ్ళను చూస్తే కనీసం మానవత్వం లేదా అని పించింది. తోట నరసింహం చిన్న వ్యక్తి కాదు. గత పదిహేనేళ్లుగా రాజ కీయాలలోను...పజ్రల్లో ఉన్న వ్యక్తి. ఆయనకు సముచిత స్థానం కల్పించలేదు అని ఆవేదన వాణి వ్యక్తం చేశారు. కాగా జగ్గంపేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని తోట వాణి భావించారు. ఈ టికెట్‌ను వైఎఎస్సార్ సీపీ గుర్తుపై గతంలో గెలిచిన జ్యోతుల నెహ్రూకు చంద్రబాబు దాదాపు ఖరారు చేశారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa