మండపేట: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ కింద ఇచ్చిన చెక్కులు ఖాతా లో వేసేందుకు బ్యాంక్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు మండపేట సెంట్రల్ బ్యాంకు ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. రాయవరం మండలం పసలపూడి లో సమావేశం లో ఉన్న ఆయన మహిళల ఫిర్యాదు అందుకుని ఇక్కడికి చేరుకున్నారు. ఈలోగా ఎమ్మెల్యే వస్తున్నారన్న సమాచారం అందుకున్న స్థానిక సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ దిరాజ్ కుమార్ అస్వస్థతకు గురై ఆసుపత్రికి వెళ్లి పోయారు. ఎమ్మెల్యే బ్యాంకు సిబ్బందిని సంబంధిత అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. వారు నిర్లక్ష్య ధోరణి లో వ్యవహరించడంతో అక్కడున్న డ్వాక్రా మహిళలతో కలిసి బ్యాంకు ముందు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. మొదటి రెండో విడత మొత్తం 350 గ్రూపులకు సంబంధించిన సోమ్ములను ఈనెల 16 శనివారం నాటికి ఖాతాలో జమ చేస్తామని అసిస్టెంట్ మేనేజర్లు అశోక్, సౌజన్య లు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ధర్నా నిర్వహిస్తుండడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టౌన్ సీఐ కిషోర్ బాబు సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. బ్యాంకర్లతో మాట్లాడి ఎమ్మెల్యే తో చర్చలు జరిపారు. తక్షణం మహిళలకు న్యాయం జరగాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. వరుసగా ప్రతిరోజు అన్ని గ్రూపులకు ఈ సొమ్ములను జమ చేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa