ఈరోజు రాత్రి చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఆర్‌సీబీ జట్టు రెండు రోజుల క్రితం చెన్నైకు చేరుకుంది. ఈక్రమంలో ఆర్‌సీబీ బ్యాటింగ్ కోచ్ దినేశ్ కార్తీక్ నగరంలోని తన ఇంటికి జట్టు సభ్యుల్ని ఆహ్వానించారు. వివిధ రకాల వంటకాలతో వారికి విందు ఏర్పాటు చేశారు. ప్లేయర్లు పసందైన డిషెస్, డ్రింక్స్ తో ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
![]() |
![]() |