రిషభ్ పంత్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) నిన్న రాత్రి ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్)తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇంకా నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే ఎస్ఆర్‌హెచ్ నిర్దేశించిన 191 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. అయితే, ఈ మ్యాచ్ అనంతరం 'స్పోర్ట్స్‌టాక్' నిర్వహించిన క్రీడా చర్చలో పంత్ కెప్టెన్సీపై కోపంతో ఓ ప్యానెలిస్ట్ టీవీని పగులగొట్టారు. పంత్ ఒక సారథిగా బ్యాటింగ్‌లో విఫలం కావడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. మొదటి మ్యాచ్‌లో డకౌట్, నిన్న కేవలం 15 రన్స్‌కే పంత్ ఔట్ కావడంపట్ల ప్యానెలిస్ట్ అసంతృప్తి వ్యక్తం చేశారు. "ఎల్ఎస్‌జీకి ఇలాంటి కెప్టెన్ అసలు అక్కర్లేదు. అలాంటి మనిషిని సారథిగా పెట్టుకుని ఎలా ఆడతాం. అతడిపై నమ్మకం పెట్టుకుంటే పనికాదు. జీవితంలో ఎవరికీ దొరకనన్ని అవకాశాలు అతడికి దొరికాయి" అంటూ టీవీపైకి రిమోట్ విసిరికొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
![]() |
![]() |