ప్రకాశం జిల్లా, యర్రగొండపాలెం పట్టణంలో ఈదుల్ ఫిత్తర్(రంజాన్) వేడుకలను ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని చివరి రోజున వద్ద జరిగిన ప్రార్థనలో వేలాది మంది ముస్లింలు పాల్గొన్నారు. ఈద్ ముబారక్ చెప్పుకున్నారు. ఈ వేడుకల్లో వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్, వైయస్ఆర్‌సీపీ నాయకులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. పట్టణంలోని జామియా మసీద్ ఆవరణంలోని ఈద్గాలో జరిగిన నమాజ్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ అనంతరం యర్రగొండపాలెం మండల మౌలానాలకు రంజాన్ తోఫాగా వస్త్రాలు కానుకగా అందించారు.
![]() |
![]() |