పాకిస్తాన్‌లో ఉగ్రవాదుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు వరుసగా భారత వ్యతిరేక ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. ఎప్పుడు ఎవరు వచ్చి కాల్చి చంపుతారో తెలియక బారత వ్యతిరేక ఉగ్రవాదులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వారు బయటికి రావాలంటేనే హడలిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా కరాచీలో లష్కరే తోయిబా(ఎల్ఈటీ) సంస్థకు ఫైనాన్షియర్‌గా వ్యవహరిస్తున్న ఖాద్రి అబ్దు రెహమాన్‌ను గుర్తుతెలియని వ్యక్తి కాల్చి చంపాడు.ఈ ఘటన పాక్ వాణిజ్య నగరమైన కరాచీలో చోటుచేసుకుంది. రంజాన్ రోజునే జరిగిన ఈ దాడికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. బైక్‌పై వచ్చిన దుండగుడు రెహమాన్ ఒక దుకాణంలో నిలబడి ఉండగా కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యాడు. అబ్దుల్ రెహమాన్ 26/11 ఉగ్రదాడి సూత్రధారి హఫీస్ సయీద్‌కు సన్నిహితుడు.రెహమాన్ లష్కరే తోయిబా సంస్థకు ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉంటూ కీలక పాత్ర పోషిస్తున్నట్టు గుర్తించారు. పాకిస్తాన్, భారత్‌లో ఎన్నో దాడులకు ఈ సంస్థ కారణం. కరాచీలో ఉంటూ నిధులు సేకరించే బాధ్యతను రెహమాన్ చూసుకునేవాడు. ఇదిలా ఉండగా, లష్కరే తోయిబా ఉగ్రవాది అబూ ఖతల్ కూడా గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హతమయ్యాడు. అబూ ఖతల్ 2017 రియాసి బాంబు పేలుడు, 2023 జమ్మూ కాశ్మీర్ యాత్రికుల బస్సుపై దాడి ఘటనలో ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు.
![]() |
![]() |