భారతదేశంలోనే అత్యంత సంపన్న మహిళగా సావిత్రి జిందాల్ నిలిచారు. అమెరికాకు చెందిన ఫోర్బ్స్ పత్రిక 2025కు చెందిన అత్యంత సంపన్న మహిళల జాబితాను రూపొందించగా సావిత్రి జిందాల్ దేశంలోనే రిచెస్ట్ ఉమెన్‌గా నిలిచారు. ఫోర్బ్స్ పత్రిక ప్రకారం సావిత్రి జిందాల్ ఆస్తుల విలువ సుమారు 35.5 బిలియన్ డాలర్లు. ముకేశ్ అంబానీ, గౌతం అదానీ తర్వాత సావిత్రి మూడో స్థానంలో నిలవడం విశేషం.విద్యుత్తు, మౌలిక సదుపాయాలు, ఉక్కు, సిమెంటు తదితర వ్యాపారాలు ఈ కుటుంబానికి ఉన్నాయి. హర్యానా రాష్ట్ర మంత్రిగా, విధాన సభ సభ్యురాలిగా పనిచేశారు. ఆమె సేవలకు భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ను ఇచ్చింది. ఈ సంస్థ 1952లో ప్రారంభమైంది. ప్రపంచంలో అత్యధికంగా ఇనుమును ఉత్పత్తిచేసే సంస్థల్లో మూడోది.ఫోర్బ్స్ జాబితా ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత సంపన్న మహిళ ఫ్రాన్స్‌కు చెందిన లోరియల్ కంపెనీ యజమాని ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్. ఆమెకు రిలయన్స్ ముఖేష్ అంబానీకంటే ఎక్కువగా ఆస్తి ఉంది. బెటెన్‌కోర్ట్‌కు $ 85.9 బిలియన్ల ఆస్తులున్నాయి. ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో 12వ స్థానంలో నిలిచారు. ముఖేష్ అంబానీ 13వ స్థానంలో ఉన్నారు. ఆయన సంపద 78.8 బిలియన్ డాలర్లు. భారతదేశంతోపాటు ఆసియా ఖండంలోనే అత్యంత ధనవంతుడిగా రిలయన్స్ ముఖేష్ అంబానీ నిలిచారు.
![]() |
![]() |