కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే గురువారం రాజ్యసభలో బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్‌పై తీవ్రంగా స్పందించారు. వక్ఫ్ బిల్లుపై బుధవారం లోక్‌సభలో చర్చ సందర్భంగా వక్ఫ్ భూమిని ఖర్గే కబ్జా చేశారని అనురాగ్ ఆరోపించారు. దీనిపై ఈరోజు రాజ్యసభలో ఖర్గే తీవ్రంగా స్పందించారు.తనపై నిరాధార ఆరోపణలు చేసినందుకు బీజేపీ ఎంపీ క్షమాపణ చెప్పాలని, ఈ విషయంలో తగ్గేదేలే (ఝుకేగా నహీ) అంటూ పుష్ప డైలాగ్‌తో ఖర్గే హెచ్చరించారు. రాజకీయ దాడులకు తాను బెదిరిపోయే వ్యక్తిని కాదన్నారు.
![]() |
![]() |