రెడ్ బుక్ పేరు చెప్పగానే వైసీపీ నాయకులు బెంబేలెత్తుతున్నారని మంత్రి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. ఇప్పటికే ఒకరికి గుండెపోటు వచ్చిందని, మరొకరు బాత్రూమ్ లో పడి చేయి విరగ్గొట్టుకున్నారని వ్యంగ్యం ప్రదర్శించారు. తాను రెడ్ బుక్ పేరెత్తితే వైసీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారని, చట్టాలు ఉల్లంఘించిన వారికే రెడ్ బుక్ వర్తిస్తుందని లోకేశ్ స్పష్టంచేశారు. మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలో నిరుపేద కుటుంబానికి శాశ్వత పట్టా అందించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... గత ప్రభుత్వం రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుచేసిందని, తాము అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నామని అన్నారు. తాము ప్రతిపక్ష నేత ఇంటి గేటుకు తాళ్లు కట్టలేదని, తప్పుడు కేసులు బనాయించడం లేదని వ్యాఖ్యానించారు.
![]() |
![]() |