భారత ఉప రాష్ట్రపతి యం.వెంకయ్య నాయుడు ఈనెల 14వతేదిన కృష్ణా జిల్లాలో పర్యటించనున్నందున అందుకు సంబంధించిన ఏర్పాట్లపై బుధవారం అమరావతి సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠ అధికారులతో సమీక్షించారు.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ఉప రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి సంబంధిత శాఖల పరంగా చేయాల్సిన ఏర్పాట్లను ఎలాంటి లోటు పాట్లకు ఆస్కారం లేని రీతిలో పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.ముఖ్యంగా 14వతేది గురవారం సాయంత్రం 4గం.లకు ఉప రాష్ట్రపతి నూజివీడులోని ఐఐఐటిలో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీలో విద్యార్ధులతో ఇంటరాక్ట్ అవుతారని కావున అక్కడ ఐఐఐటి వారు తగిన ఏర్పాట్లు చేయాలని సిఎస్ ఆదేశించారు.మిగతా ప్రాంతాలలో జిల్లా అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేయాలని చెప్పారు.ఉప రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి వివిధ శాఖలవారీగా చేయాల్సిన ఏర్పాట్లను ఎలాంటి లోటుపాట్లకు అవకాశం ఇవ్వకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని సిఎస్ అనిల్ చంద్ర పునేఠ అధికారులను ఆదేశించారు.
అంతకు ముందు ప్రోటోకాల్ విభాగం అదనపు కార్యదర్శి అశోక్ బాబు వివిధ శాఖల వారీగా చేయాల్సిన ఏర్పాట్లను చదివి వినిపించి ఆప్రకారం తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈసమావేశంలో సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్,విజయవాడ పోలీస్ కమీషనర్ ద్వారకా తిరుమల రావు,కృష్ణా జిల్లా ఎస్పి సర్వశ్రేష్ట త్రిపాఠి,ఐఎస్ డబ్ల్యు ఎస్పి టిఆర్ ప్రసాదరావు,డెరైక్టర్ ఫైర్ సర్వీసెస్ జయరామ్ నాయక్,కృష్ణా జిల్లా జెసి-2 పి.బాబూ రావు,డియంఇ డా.కె.బాబ్జి,నూజివీడు సబ్ కలక్టర్ స్వాప్నిల్ పండాకర్,నూజివీడు ఐఐఐటి డైరెక్టర్ ప్రొ.డి.సూర్యచంద్రరావు,సమాచారశాఖ జెడి పి.కిరణ్ కుమార్ ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కాగా ఉప రాష్ట్రపతి యం.వెంకయ్య నాయుడు ఈనెల 14వతేది ఉ.11.20గం.లకు కోయంబత్తూర్ నుండి ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 12.40గం.లకు విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని రోడ్డు మార్గంలో ఆత్కూర్ వద్ద గల స్వర్ణ భారతి ట్రస్ట్ కు చేరుకుంటారు.భోజన విరామం అనంతరం ఆయన మధ్యాహ్నం 3గం.లకు స్వర్ణ భారతి ట్రస్ట్ నుండి రోడ్డు మార్గంలో బయలుదేరి సాయంత్రం 3.45గం.లకు నూజివీడు ఐఐఐటి క్యాంపస్ కు చేరుకుంటారు.అనంతరం సా.4గం.ల నుండి 5గం.ల వరకూ అక్కడ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ విద్యార్ధులతో ఇంటరాక్ట్ అవుతారు. అనతంరం సా.5.15గం.లకు నూజీవీడు ఐఐఐటి నుండి రోడ్డు మార్గంలో బయలుదేరి సా.6 గం.లకు ఆత్కూర్ స్వర్ణ భారతి ట్రస్ట్ కు చేరుకుని రాత్రి బస చేస్తారు.15వతేది ఉ.9.30 గం.ల నుండి ఉ.10.45గం.ల వరకూ స్వర్ణభారతి ట్రస్ట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొన్న పిదప ఉ.11గం.లకు స్వర్ణ భారతి ట్రస్ట్ నుండి రోడ్డు మార్గంలో బయలుదేరి 11.20 గం.లకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో హైదరాబాదు బయలుదేరి వెళతారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa