ఐపీఎల్ 2025లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన SRH జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ బ్యాటర్లలో నితీష్ కుమార్ 31, క్లాసెన్ 27 పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో సిరాజ్ 4 వికెట్లు తీయగా.. సాయి కిషోర్, ప్రసిద్ధ్ తలో రెండు వికెట్లు తీశారు.మహ్మద్ సిరాజ్ (4/17) సంచలన ప్రదర్శన చేయడంతో సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. నితీశ్ కుమార్ రెడ్డి (31) టాప్ స్కోరర్. క్లాసెన్ (27), కమిన్స్ (22*), అభిషేక్ శర్మ (18), అనికేత్ వర్మ (18), ఇషాన్ కిషన్ (17) పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో సిరాజ్‌తోపాటు ప్రసిద్ధ్ కృష్ణ 2, సాయి కిశోర్ 2 వికెట్లు పడగొట్టారు
![]() |
![]() |