మాజీ డిప్యూటీ సీఎం, వైసీపీ నేత అంజాద్ భాషా సోదరుడు వైసీపీ నేత అహ్మద్ బాషాను పోలీసులు అరెస్ట్ చేసారని వైసీపీ నేతలు తెలియజేసారు. వారు మాట్లాడుతూ.... ఆయనను ఏ పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లారు అనేది మాత్రం పోలీసులు వెల్లడించలేదు. ఏపీలో పోలీసులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. అక్రమ కేసులు బనాయించి వైయస్ఆర్‌సీపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారు. మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషాను ముంబైలో పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం, ముంబై నుంచి బెంగళూరుకు విమానంలో తరలించి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఏపీకి తీసుకువచ్చారు. అయితే అహ్మద్ బాషాను ఏ పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లారు అనేది మాత్రం పోలీసులు వెల్లడించలేదు. నగర శివారులోని పోలీసు శిక్షణ కేంద్రంలో ఆయనను విచారిస్తున్నట్లు సమాచారం. మరోవైపు.. కడప చిన్న చౌక్ పోలీసు స్టేషన్ వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. తాజాగా చిన్న చౌక్ పోలీస్ స్టేషన్‌లోనే ఆయనపై కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది.
![]() |
![]() |