ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యంగ్ గ్లోబల్ లీడర్ గా నారా లోకేష్..!!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 14, 2019, 10:12 AM

రాజకీయాల్లో తమని తాము నిరూపించుకోలేని వ్యక్తులు, సమాజం బహిష్కరించిన వ్యక్తులు, ప్రజలు మర్చిపోయిన వ్యక్తులు చేసే విమర్శలకు ధీటైన స‌మాధానం చెపుతూ ప‌నితీరుతో ప్ర‌శంస‌లందుకున్న  మంత్రి లోకేష్  ఎన్నో కంపెనీలను ఆంధ్రప్రదేశ్ కి తీసుకురావడమే కాదు గ్రామీణ అభివృద్దికి కూడా తన శాఖ ద్వారా దాదాపుగా విజయం సాధించారు. తాజాగా లోకేష్ సామర్ధ్యానికి అరుదైన గుర్తింపు దక్కింది. 2019 యంగ్ గ్లోబల్ లీడర్స్ జాబితాను వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకటించారు. మంత్రి నారా లోకేష్ ని యంగ్ గ్లోబల్ లీడర్ గా వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా 127 మందిని యంగ్ గ్లోబల్ లీడర్స్ గా వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకటించగా అందులో నారా లోకేష్ ఉన్నారు.


సౌత్ ఏషియా నుండి 12 మందిని యంగ్ గ్లోబల్ లీడర్స్ గా వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకటించింది. ఇండియా నుండి ఇప్పటి వరకూ పబ్లిక్ ఫిగర్స్ క్యాటగిరి లో 6 గురికి అరుదైన గౌరవం దక్కింది. 5 ఏళ్ల పాటు వరల్డ్ ఎకనామిక్ ఫోరం యంగ్ గ్లోబల్ లీడర్ గా లోకేష్ కొనసాగనున్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa