ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చైనా వస్తు బహిష్కరణకు పిలుపు

national |  Suryaa Desk  | Published : Thu, Mar 14, 2019, 01:47 PM

న్యూఢిల్లి : చైనాకు చెందిన వస్తువులను బహిష్కరించాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. చైనా వస్తువులపై నిషేధం విధించాలంటూ ట్విటర్‌లో అనేకమంది పోస్టులు పెట్టారు. ముంబై దాడుల సూత్రధారి, జైష్‌-ఎ-మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ అధ్యక్షుడు మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని కోరుతూ యుఎన్‌లో ఫ్రాన్స్‌, అమెరికా, ఇంగ్లాండ్‌ చేసిన ప్రతిపాదనకు చైనా అడ్డుపడటంతో భారతీయులు చైనాపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. చైనా వస్తువులపై నిషేధం విధించాలని, చైనా వస్తువులను బహిష్కరించాలని కోరుతూ వారు ట్వీట్లు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa