ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతుండగా.. నేతలు పార్టీలు మారడం నిత్యతంతుగా మారిపోయింది. తాజాగా టీడీపీ నేత రాయపాటి అలక . సీనియర్ నేత, నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు వైసీపీలోకి వెళ్తున్నట్టు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ స్థానానికి అభ్యర్థిని ప్రకటించే విషయంలో టీడీపీ వ్యవహరిస్తున్న తీరుపట్ల ఆయన అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. నరసరావు పేట పార్లమెంటు స్థానంలో టీడీపీ రాయపాటిని పక్కనబెట్టి.. భాష్యం రామకృష్ణ పేరును పరిశీలిస్తోందన్న ప్రచారం నేపథ్యంలో సందిగ్ధత నెలకొంది. పార్టీ అధిష్టానం కూడా ఆయనకు ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. నరసరావు పేట ఎంపీ స్థానం తనకు, సత్తెనపల్లి అసెంబ్లీ స్థానం తన కుమారుడికి ఇవ్వాలని.. రాయపాటి అధిష్టానాన్ని కోరారు. అయితే, పార్టీ ఒప్పుకోకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు.
ఈ నేపథ్యంలోనే ఆయన వైసీపీ వైపు వెళ్లే యోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో, వైసీపీ కీలక నేతలు రాయపాటి సోదరులను తమ పార్టీలో చేర్చకునేందుకు రంగంలోకి దిగారు. ఇప్పటికే వైసీపీ నుంచి ఫోన్‌కాల్స్ వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే, టీడీపీ తీరుపై రాయపాటి అనుచరులు, అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై ఆయన స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa