పాకిస్థాన్ ను భారీ భూకంపం వణికించింది. రావల్పిండికి 60 కిలోమీటర్ల దూరంలో... భూ ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకటించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.8గా ఉంది. ఈ మధ్యాహ్నం ఒంటి గంటకు భూకంపం సంభవించింది. జమ్మూకశ్మీర్ వరకు భూప్రకంపనలు వచ్చాయి. ప్రాణ, ఆస్తి నష్టాలకు సంబంధించిన వివరాలు వెల్లడి కాలేదు. భూకంపం నేపథ్యంలో పాకిస్థాన్ లో రైళ్ల వేగాన్ని తాత్కాలికంగా తగ్గించారు. అన్ని రైలు సేవలు అంతరాయం లేకుండా కొనసాగుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa