ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రూప్‌-1 పరీక్ష మరోసారి వాయిదా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 14, 2019, 10:21 PM

ఆంధ్రప్రదేశ్‌లో జరగాల్సిన గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష మరోసారి వాయిదా పడింది. వాస్తవానికి ఈ పరీక్ష మార్చి 31న జరగాల్సి ఉంది. అయితే, దీనిని మే 26కు వాయిదా వేస్తూ ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీపీఎస్సీ ప్రకటనను విడుదల‌ చేసింది ఈ నిర్ణయాన్ని గ్రూప్‌-1 అభ్యర్థులు స్వాగతిస్తున్నారు. పరీక్షల‌కు సన్నద్ధమయ్యేందుకు మరింత సమయం దొరికిందని ఆనందపడుతున్నారు. వాస్తవానికి గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష మార్చి 10న జరుగుతుందని ఏపీపీఎస్సీ మొదట ప్రకటించింది. అయితే, ఆ సమయంలో అభ్యర్థులు దీనిని వాయిదా వేయమని కోరడంతో మార్చి 31కి మార్చారు. ఇప్పుడు ఎన్నిక షెడ్యూల్ వెలువడడంతో ఈ సారి ఏపీపీఎస్సీ వాయిదా వేసింది. దీంతో జూన్‌ 10 నుంచి 22 వరకు జరిగే మెయిన్స్‌ కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 169 గ్రూప్‌-1 పోస్టు కోసం 1.14 క్ష మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa