ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇకపై రైళ్లలోనూ ఏటీఎం సేవలు.. తొలిసారి ఆ రైల్లో

national |  Suryaa Desk  | Published : Wed, Apr 16, 2025, 09:00 PM

మాల్స్, ఆఫీసులు, రహదారుల పక్కన, పెద్దపెద్ద ఆఫీసులు, ఉన్న ఏటీఎం (ఆటోమేటిక్ టెల్లర్ మెషీన్ ATM) సేవలు త్వరలో కదిలే రైళ్లలోనూ రానున్నాయి. ప్రయాణికులకు ఈ సేవలను అందించేందుకు ఇండియన్ రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. ప్రయోగాత్మకంగా దేశంలోని మొట్టమొదటిసారి మధ్య రైల్వే ఈ సేవలు ప్రారంభిస్తోంది. మంగళవారం విజయవంతంగా ట్రయల్ రన్ పూర్తి చేసింది. మన్మాడ్–ముంబయి మధ్య నడిచే పంచవటి ఎక్స్‌ప్రెస్‌‌లో ఏటీఎంను ఏర్పాటు చేసింది. ట్రయల్ రన్ సాఫీగా జరిగిందని అధికారులు తెలిపారు. అయితే, ఇగత్పురి, కసారా మధ్య ఉండే నెట్‌వర్క్ లేని ప్రాంతంలో ముఖ్యంగా సొరంగాల వల్ల కొన్నిసార్లు సిగ్నల్ పోవడం మాత్రమే ఒక చిన్న సమస్య అని పేర్కొన్నారు.


 భుసావల్ డివిజనల్ రైల్వే మేనేజర్ ఇటి పాండే మాట్లాడుతూ... ట్రయల్ రన్‌లో మంచి రిజల్ట్స్ వచ్చాయి.. ఇక ప్రయాణికులు కదులుతున్న రైలులో నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. మేం ఏటీఎం పనితీరును నిరంతరం పరిశీలిస్తూనే ఉంటాం’ అని తెలిపారు.


రైల్వే భుసావల్ డివిజన్, మహారాష్ట్ర బ్యాంక్ భాగస్వామ్యంతో ఇన్నోవేటివ్ అండ్ నాన్-ఫేర్ రెవెన్యూ ఐడియాస్ స్కీమ్ Innovative and Non-Fare Revenue Ideas Scheme (INFRIS) కింద ఈ ఏటీఎం ఏర్పాటైంది. ‘ INFRIS సమావేశం సమయంలో రైళ్లలో ఏటీఎం పెట్టే ఆలోచనను మొదట ప్రతిపాదించాం... ప్రతిపాదన వచ్చిన వెంటనే మేము అమలు విధానాలపై చర్చించాం’ అని పాండే చెప్పారు.


పంచవటి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులు, రైల్లో ఏటీఎం అందుబాటులోకి తీసుకురావడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఏసీ కోచ్‌లో దీనిని ఏర్పాటు చేసినప్పటికీ, రైలులోని 22 బోగీల్లోని అందరికీ కనిపించేలే అనుసంధానం చేశారు..


సంజయ్ ఝా అనే ప్రయాణికుడు మాట్లాడుతూ.. ‘ఇది రైల్వే చేపట్టిన మంచి కార్యక్రమం. రైళ్లోనే నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు, చెక్‌బుక్‌లు ఆర్డర్ చేయవచ్చు, స్టేట్‌మెంట్‌లు పొందవచ్చు. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది’ అని అన్నారు. పంవటి ఎక్స్‌ప్రెస్‌ బోగీలు.. ముంబయి-హింగోలి జన్‌శతాబ్ది ఎక్స్‌ప్రెస్ (12071)ను కలపడం వల్ల ఈ ఏటీఎం సేవలు హింగోలి వరకు ప్రయాణించే దూర ప్రయాణికులకు కూడా అందుబాటులో ఉంటాయి. ఏటీఎం సేవలకు ప్రజాదరణ పొందితే ఇతర ముఖ్యమైన రైళ్లలో కూడా ఈ సదుపాయం విస్తరించే అవకాశముంది. భద్రత పరంగా ఏటీఎం కియోస్క్‌ను అవసరమైనప్పుడు మూసివేయొచ్చు. అలాగే 24 గంటల సీసీటీవీ పర్యవేక్షణలో ఉంటుందని అధికారులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa