వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో భారీ చోరీ జరిగింది. బొల్లవరంలో ఉంటున్న చంద్రశేఖర్రెడ్డి బంధువుల ఇంట్లో పెళ్లి ఉండడంతో కుటుంబంతో కలిసి కర్నూలు వెళ్లారు. ఈ క్రమంలో దొంగలు ఇంట్లోకి చొరబడి 60 తులాల బంగారం.
3 కిలోల వెండి, రూ.14 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. గురువారం ఉదయం తిరిగి వచ్చాక చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa