ముదిగుబ్బ మండలంలోని యాకర్లకుంటపల్లి, ముక్తాపురం, నలాయికుంటపల్లి, నల్లచెర్లపల్లి గ్రామాల్లో సీఐ శివరాముడు గురువారం గ్రామ సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా రచ్చకట్టలపై గ్రామస్థులతో మమేకమై మాట్లాడారు.
కక్షలు కార్పన్యాలకు స్వస్తి చెప్పి ప్రశాంతంగా గడపాలని సూచించారు. ఫ్యాక్షన్ వద్దు పిల్లల భవిష్యత్తు ముద్దన్నారు. సైబర్ నేరాలు, శక్తియాప్, దొంగతనాలు, బెట్టింగ్, మట్కాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa