ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్ అగ్రికల్చరల్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఈఏపీసెట్ (EAPCET) పరీక్షలు ఈ నెల 29 నుంచి ప్రారంభమవనున్నాయి. మే 4 వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నట్లు అధికారులు వెల్లడించారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లు, ఇతర వివరాలను అధికారిక వెబ్‌సైట్ నుంచి పొందవచ్చని తెలిపారు. ఈ పరీక్ష రెండు దశల్లో ఉంటుంది. అగ్రికల్చర్, ఫార్మాకు ఒకసారి, ఇంజనీరింగ్ విభాగానికి మరోసారి ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa