ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘వక్ఫ్’ విషయంలో సుప్రీంకోర్టు జోక్యంపై ఆరోపణలు.. కేంద్రం తీరుపై హైదరాబాద్ ఎంపీ ఒవైసీ విమర్శలు

national |  Suryaa Desk  | Published : Fri, Apr 18, 2025, 08:42 PM

న్యాయవ్యవస్థ స్వతంత్రమైందని, ఒక చట్టం రాజ్యాంగానికి అనుగుణంగా ఉందా లేదా అనే విషయంలో పరిశీలించాల్సిన బాధ్యత కూడా దానికి ఉందని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టిన నేపథ్యంలో న్యాయవ్యవస్థ తర పరిధులు మించి వ్యవహరిస్తోందనే ఆరోపణలపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


జాతీయ మీడియాకు ఇచ్చిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఒవైసీ మాట్లాడుతూ.. ‘‘సుప్రీం కోర్టు ఒక చట్టం వ్యక్తిగత స్వేచ్ఛలు, మౌలిక హక్కులు, లేక రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణాన్ని ఉల్లంఘిస్తుందా అనే విషయాన్ని పరిశీలించాల్సి ఉంటుంది... ఇది అంగీకరించాల్సిందే... ప్రభుత్వం చిన్నపిల్లలా ప్రవర్తిస్తోంది... ఓ పిల్లాడు నాకు ఒక బొమ్మ దక్కకపోతే నేను ఏడుస్తా అన్నట్టు వ్యవహరిస్తోంది. ఇది సరైంది కాదు’ అని ఎంఐఎం అధినేత అన్నారు. సుప్రీం కోర్టులో వక్ఫ్ చట్టాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన వారిలో ఒవైసీ కూడా ఒకరు.


కాగా, ఈ కేసులో వక్ఫ్ చట్టంలోని రెండు ముఖ్యమైన సెక్షన్లను ఒక వారంపాటు అమలు చేయరాదని కేంద్రాన్ని సుప్రీంకోర్టుకు ఆదేశించింది. అదే సమయంలో కేంద్రం ప్రతిస్పందనకు వారం రోజుల సమయం ఇచ్చింది. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని.. ఇది సమానత్వం, మత స్వేచ్ఛ వంటి పలు రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిచేలా ఉందని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు.


ఒవైసీ మాట్లాడుతూ.. ‘ఈ చట్టం వక్ఫ్ ఆస్తులను క్రమబద్ధీకరించేందుకే అని చెప్పినా, ముస్లిం సమాజానికి నష్టం కలిగిస్తుంది.. ఏడు విభాగాల్లో ముస్లింలు తమ వక్ఫ్ ఆస్తులను కోల్పోతారు.. ఈ చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించేవరకు మా నిరసన, న్యాయపోరాటం కొనసాగుతుంది. లేకపోతే ప్రభుత్వం ఈ ఆస్తులను దోచుకుంటుంది. బాధితులు ముస్లింలే అవుతారు’ అని ఒవైసీ స్పష్టం చేశారు.


వక్ఫ్ బిల్లు ఆమోదం పొందినందుకు అసదుద్దీన్ ఓవైసీ నవ్వారా.. వీడియో వైరల్


ఈ సవరణ చట్టాన్ని వ్యతిరేకించడానికి అత్యంత బలమైన రాజ్యాంగ కారణం ఏంటని ప్రశ్నించగా. ఇది ఒక న్యాయపోరాటంగా సాగితే వక్ఫ్ బోర్డు, ముస్లిం సమాజానికి మరింత నష్టం జరుగుతుంది’ అని అన్నారు. ఉదాహరణగా వక్ఫ్ ఆస్తులపై లిమిటేషన్ చట్టంను వర్తింపజేసినందున, ఇప్పుడు ఆక్రమణదారులే ఆ ఆస్తుల యజమానులుగా మారతారని పేర్కొన్నారు.


‘‘సెక్షన్ 2 ప్రకారం.. వక్ఫ్‌గా పరిగణించిన కొన్ని ఆస్తులు ఇకపై ఆ బోర్డు కింద ఉండవని, ఇది మన దేశంలోని అత్యంత ధనిక వ్యక్తికి లాభం చేకూరుస్తుంది,..ఆయన ఖోజా ఖోజా అనాథాశ్రమం స్థలంపై తన మహా వైభవమైన నివాసాన్ని నిర్మించారు’ అని ఒవైసీ విమర్శించారు. అలాగే, ఇస్లాంను ఐదేళ్ల పాటు ఆచరిస్తున్నావా లేదా అనే ప్రమాణాన్ని నిర్దారించే అంశం చట్టంలో ఉండటం అన్యాయమని పేర్కొన్నారు. ‘ఇస్లాంను ఆచరిస్తున్నారా లేదా అనే అంశాన్ని ఎవరు నిర్ణయిస్తారు?" అని ప్రశ్నించారు. ‘ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమంటే, వక్ఫ్ ప్రాపర్టీలన్నీ ప్రభుత్వ సంరక్షణకు వెళ్లిపోతాయి. అంటే, ఇవి ఇకపై ముస్లింలకు దక్కవు’ అని ఆయన చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa