నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ, తమిళనాడు గవర్నర్ కేసులో ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో న్యాయవ్యవస్థ అధికారాలపై తీవ్ర చర్చ జరుగుతోంది. రాష్ట్రపతి నిర్ణయాలు తీసుకోవడానికి సుప్రీంకోర్టు గడువు పెట్టకూడదని వ్యాఖ్యానించిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్.. న్యాయవ్యవస్థ ప్రజాస్వామ్యంపై అణుబాంబు వేయకూడదని, జడ్జీలు శాసనాలు చేయకూడదని ఆయన అన్నారు. రాష్ట్రపతికి గడువు పెట్టేలా న్యాయవ్యవస్థ వ్యవహరించడం సరికాదని, ఇప్పుడు మనకు శాసనాలు చేయగలిగే జడ్జీలు ఉన్నారని, వారే కార్యనిర్వాహక విధులు కూడా నిర్వర్తిస్తారని ఆయన విమర్శించారు.
సుప్రీంకోర్టు ఒక సూపర్ పార్లమెంటులా వ్యవహరిస్తోందని, వారికి ఎలాంటి జవాబుదారీతనం లేదని ఆయన అన్నారు. రాజ్యాంగంలోని 142వ ఆర్టికల్ సుప్రీంకోర్టుకు సంపూర్ణ అధికారాలు ఇచ్చిందని, దాని ద్వారా ఏ అంశంలోనైనా న్యాయం జరిగేలా ఆదేశాలు ఇవ్వవచ్చని ఆయన అన్నారు. ఇది 24/7 అందుబాటులో ఉండే అణుక్షిపణిలాంటిదని ఆయన అభివర్ణించారు. ఇటీవల ఒక తీర్పులో రాష్ట్రపతికే ఆదేశాలు ఇచ్చారని, ఇది ఆందోళన కలిగిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆర్టికల్ 142 గురించి తీవ్ర చర్చ జరుగుతోంది. అందులో ఏముంది? ఆ ఆర్టికల్ న్యాయవ్యవస్థకు ఇచ్చిన అధికారాలు ఏంటి? అనేది ఆసక్తికరంగా మారింది.
ఆర్టికల్ 142
ఆర్టికల్ 142 భారత రాజ్యాంగంలోని ఒక ప్రత్యేకమైన విధానం. దీని ఆధారంగా ప్రజలకు న్యాయం చేయడానికి అవసరమైన అన్ని ఉత్తర్వులు, ఆదేశాలు, తీర్పులు ఇవ్వగల అధికారం సుప్రీంకోర్టుకు ఇస్తుంది. సుప్రీంకోర్టు తన అధికార పరిధిని వినియోగించుకుని, పెండింగ్‌లో ఉన్న ఏదైనా కారణం లేదా విషయంలో పూర్తి న్యాయం చేయడానికి అవసరమైన డిక్రీని లేదా ఆదేశాన్ని జారీ చేయవచ్చు. అలా జారీ చేసిన ఏదైనా డిక్రీ లేదా ఆదేశం.. పార్లమెంటు చేసిన ఏదైనా చట్టం ద్వారా లేదా దాని కింద సూచించిన విధంగా ఆ తరపున నిబంధన చేసే వరకు, రాష్ట్రపతి ఆదేశం ద్వారా సూచించిన విధంగా భారత భూభాగం అంతటా అమలు చేయబడుతుంది.
ఈ విషయంలో పార్లమెంటు చేసిన ఏదైనా చట్టంలోని నిబంధనలకు లోబడి, సుప్రీంకోర్టు, దేశ భూభాగం మొత్తానికి సంబంధించి, ఏ వ్యక్తి హాజరు కావడానికి, ఏవైనా పత్రాలను కనుగొనడానికి లేదా రూపొందించడానికి లేదా ఏదైనా స్వీయ ధిక్కారానికి దర్యాప్తు లేదా శిక్షను నిర్ధారించడానికి ఏదైనా ఉత్తర్వులు ఇచ్చే అన్ని అధికారాలను కలిగి ఉంటుంది.
ముఖ్యాంశాలు: పూర్తి న్యాయం కోసం అవసరమైన ఏదైనా నిర్ణయం తీసుకోవడం కోసం సుప్రీంకోర్టుకు అధికారం ఉంటుంది. ఇది సాధారణంగా న్యాయ పరిధిలో లేనిది అయినా, న్యాయం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకునేందుకు ఉపయోగపడుతుంది. ఈ ఆర్టికల్ చట్టం కన్నా ఎక్కువ కాదు.. కానీ ఇది చట్టాలను అమలు చేయడంలో లోపాలను పూరించడానికీ, సరిచూడడానికీ ఉపయోగపడుతుంది. గతంలో ఈ ఆర్టికల్‌ను ఉపయోగించుకుని పలు కేసుల్లో తీర్పులు వెలువరించింది. హిమాన్షు శర్మ కేసు (యూజీసీ vs సిటీ కాంప్లీక్స్), అయోధ్య- బాబ్రీ మసీదు కేసులో ఆర్టికల్ 142 ఆధారంగా సుప్రీం కోర్టు తుది తీర్పు ఇచ్చింది. అనిల్ అంబానీ కేసులో జరిమానా విధించడం
ఎందుకు ప్రత్యేకం?
ఇది న్యాయం కోసం చట్టాన్ని కలుపుకునే మార్గం. అసాధారణ పరిస్థితుల్లో చట్టానికి లోబడి కాకపోయినా, ప్రజలకు కోర్టు న్యాయం చేయగలదు.కానీ, ఇది అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగపడుతుంది. ఇది సుప్రీం కోర్టుకు అపారమైన శక్తిని అందిస్తుంది. కొన్ని సందర్భాల్లో చట్టం లేదా కానీ న్యాయం అవసరం ఉన్నప్పుడు, ఈ ఆర్టికల్ కీలకంగా మారుతుంది.అంటే, ఆర్టికల్ 142 అనేది ‘న్యాయం కోసమే, న్యాయానికోసం’ అనే సిద్ధాంతాన్ని నెరవేర్చే విధంగా రూపొందించి ఒక అత్యంత శక్తివంతమైన రాజ్యాంగ నియమం.
1. బోపాల్ గ్యాస్ ట్రాజిడీ కేసు – 1989
1984లో బోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీలో జరిగిన విషవాయు లీక్ కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో ఆర్టికల్ 142 ద్వారా సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. బాధితులకు రూ.750 కోట్ల నష్టపరిహారం వేగంగా చెల్లించాలని ఆదేశించింది. అప్పటికి చట్టాలు తక్కువగా ఉండటంతో, కోర్టు తన ప్రత్యేక అధికారం ఉపయోగించింది.
2. అయోధ్య కేసు
దాదాపు 150 ఏళ్లుగా కొనసాగుతోన్న అయోధ్య రామమందిరం.. బాబ్రీ మసీదు వివాదంపై తుది తీర్పులో ఈ ఆర్టికల్ 142ను పరిగణనలోకి తీసుకుని రామ మందిర నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. దీని ద్వారా: ముస్లింలకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతో వారికి ప్రత్యామ్నాయంగా మసీదు నిర్మాణానికి 5 ఎకరాల భూమిని ఇచ్చేందుకు ఆదేశాలు ఇచ్చింది. చట్ట ప్రకారం అవసరం కాకపోయినా ‘పూర్తి న్యాయం’ కోసం ఇచ్చిన ఆదేశం.
3. సాహిల్ చౌదరి వర్సెస్ సెంట్రల్ గవర్నమెంట్
ఆక్రమణదారులు వక్ఫ్ లేదా ప్రభుత్వ ఆస్తులు స్వాధీనం చేసుకోవడంతో చట్టం ప్రకారం వీరిని గెంటేయడం సాధ్యం కాకపోయినా Article 142 ద్వారా సమర్థవంతమైన నిర్ణయం తీసుకుంది.
కొన్ని సందర్భాల్లో, భార్యాభర్తల మధ్య సంబంధం పూర్తిగా విచ్ఛిన్నం అయినప్పుడు చట్టం ప్రకారం విడాకులు ఇచ్చే అవకాశం లేకపోయినా, ఆర్టికల్ 142 ఆధారంగా కోర్టు విడాకులు మంజూరు చేసింది. రవికుమార్-జుల్మీదేవి దంపతుల కేసు: కోర్టు అభిప్రాయం ప్రకారం ‘చట్టపరంగా వీరిద్దరి మధ్య బంధం ఉండటం కన్నా విడిపోయి జీవించటం మంచిది’ అని ఆర్టికల్ 142 ఆధారంగా వివాహాన్ని రద్దుచేసింది
5. అనిల్ అంబానీ కేసు 2019
ఎరిక్‌సన్ కంపెనీకి బాకీ చెల్లించనందుకు అంబానీపై కోర్టు ధిక్కారణ కేసు నమోదయ్యింది. ఆర్టికల్ 142 ద్వారా: సుప్రీం కోర్టు జైలు శిక్ష విధించకుండా నేరుగా చెల్లింపుకు ఆదేశించింది. న్యాయపరంగా, సమయానుకూలంగా సమర్ధమైన తీర్పును ఇచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa