గతేడాది జులైలో బంగ్లాదేశ్ యువత రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం చివరకు షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం పతనానికి దారితీసింది. అనంతరం ఆ దేశంలో జరిగిన పరిణామాలు ముఖ్యంగా పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు బలపడుతున్నాయి. తాజాగా, దాదాపు 15 ఏళ్ల అనంతరం బంగ్లాదేశ్, పాకిస్థాన్ మధ్య విదేశాంగ కార్యదర్శుల స్థాయిలో చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా 1971 నాటి అఘాత్యాలపై పాకిస్థాన్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని బంగ్లాదేశ్ డిమాండ్ చేసింది. అలాగే, పాక్ నుంచి విడిపోయి బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా మారిన సమయంలో ఉన్న ఉమ్మడి ఆస్తుల్లో తమ వాటాగా 4.3 బిలియన్ డాలర్ల చెల్లించాలని కోరింది. ఈ చర్చలు పాకిస్థాన్ డిప్యూటీ ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్.. బంగ్లాదేశ్ పర్యటన (ఏప్రిల్ 27-28)కు ముందు జరగడం గమనార్హం. డాకాలోని స్టేట్ గెస్ట్ హౌస్ పద్మలో జరిగిన ఈ చర్చల్లో బంగ్లాదేశ్ విదేశాంగ కార్యదర్శి జషిం ఉద్దీన్, పాక్ విదేశాంగ కార్యదర్శి అమ్నా బలోచ్ పాల్గొన్నారు.
జషిం ఉద్దీన్ మాట్లాడుతూ.. ‘మేము చారిత్రాత్మకంగా పరిష్కరించని సమస్యల గురించి పాకిస్థాన్‌తో చర్చించాం’ అని అన్నారు. ఈ సమస్యల్లో: 1971 యుద్ధం సమయంలో పాకిస్థాన్ సైన్యం చేసిన ఊచకోతకు సంబంధించి బహిరంగ క్షమాపణ, బంగ్లాదేశ్‌లో చిక్కుకున్న పాకిస్థానీయుల పునరుద్ధరణ, పాక్‌లో ఉన్నప్పుడు ఉమ్మడి ఆస్తుల సమాన పంపకం, 1970 తుఫాన్ బాధితులకు ఇచ్చిన విదేశీ ఆర్థిక సహాయం బదిలీ వంటి అంశాలు ఉన్నాయని చెప్పారు. ‘చారిత్రాత్మకంగా పరిష్కారం కాని సమస్యలను పరిష్కరించుకోవడానికి సరైన సమయం... ఈ సమస్యలు పరిష్కారమైతే, పరస్పర ప్రయోజనాల కోసం బలమైన సంబంధాల పునాదిని వేసుకోవచ్చు’ అని అన్నారు.
ఈ విషక్ష్ంలో పాకిస్థాన్ ప్రతిస్పందన ఏంటి? అని మిడియా ప్రశ్నించగా..‘వారు ఈ విషయాలపై సానుకూలంగా చర్చలు కొనసాగించాలని భావిస్తున్నారు’ అని సమాధానం ఇచ్చారు. అలాగే, 1970 తుఫాన సమయంలో తూర్పు పాకిస్థాన్ బాధితుల కోసం వచ్చిన 200 మిలియన్ డాలర్ల విదేశీ విరాళం చెల్లించాల్సిందిగా పాకిస్థాన్‌ను కోరింది. ఈ మొత్తాన్ని డాలర్ విలువలో పరిగణనలోకి తీసుకున్నారా అని అడిగితే.. ‘ఈ దఫా కేవలం ప్రస్తావించాం.. తరువాతి చర్చల్లో పూర్తి వివరాలు తేలుతాయి’ అని ఉద్దీన్ తెలిపారు.
గతేడాది బంగ్లాదేశ్‌లో షేక్ హసినా ప్రభుత్వ పతనం అనంతరం ఇరు దేశాల దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే చర్చలు జరపడగం గమనార్హం. . ముహమ్మద్ యూనుస్ సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వం ..1971లో బంగ్లాదేశ్ స్వాతంత్ర్య సంగ్రామంలో ముజిబుర్ రెహ్మాన్ పాత్రను తగ్గించాలనే ధోరణిలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ యుద్ధంలో బంగ్లాదేశ్‌కు అన్ని విధాలుగా అండగా నిలిచిన భారత సైన్యం.. 90 వేల మంది పాకిస్థానీ సైనికులను బందీలుగా తీసుకుంది. బంగ్లాదేశ్, పాక్ సంబంధాల బలపడటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిని ఉద్దీన్ తోసిపుచ్చారు. ‘ఇది ఒకరిపైవు మొగ్గుచూపడమో.. ఇంకొకరితో మొగ్గు తగ్గడమో కాదు. మేము ప్రతి దేశంతో పరస్పర గౌరవం, పరస్పర ప్రయోజనాల ఆధారంగా సంబంధాలను నిర్మించాలనుకుంటున్నాం.’ అని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa