ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉగ్రవాది మసూద్ అజర్ ఆస్తుల స్వాధీనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 15, 2019, 02:29 PM

పారిస్: జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌పై చర్యలకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సభ్య దేశమైన ఫ్రాన్స్ సిద్ధమైంది. అతని ఆస్తులను ఫ్రీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అతన్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలన్న ప్రతిపాదన తీసుకొచ్చిన మూడు దేశాల్లో ఫ్రాన్స్ కూడా ఒకటి. అయితే చివరి నిమిషంలో చైనా మరోసారి ఈ ప్రతిపాదనను అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఇతర చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అమెరికా ఇప్పటికే హెచ్చరించింది. ఇప్పుడు ఫ్రాన్స్ ఆ పని మొదలుపెట్టింది. ఉగ్రవాదంతో సంబంధం ఉన్న వ్యక్తులతో యురోపియన్ యూనియన్ ప్రత్యేకంగా ఓ జాబితాను నిర్వహిస్తోంది. ఆ జాబితాలో మసూద్ పేరును చేర్చే అంశంపై చర్చిస్తామని ఫ్రాన్స్ అంతర్గత మంత్రిత్వ శాఖ, ఆర్థిక శాఖ, విదేశాంగ శాఖ సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa