ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జ‌న‌సేన జ‌నంలోకి ప్ర‌చార యాత్ర‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 15, 2019, 10:04 PM

స్థానిక 30వ డివిజన్ కొండ ప్రాంతంలో స్థానిక నాయకులు తాజ్ నోత్ మైనర్ బాబు ఆధ్వర్యంలో జరిగింది.ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నాయకులు స్పీకర్స్ ప్యానల్ సభ్యులు పోతిన వెంకట మహేష్ ముఖ్య అతిధిగా పాల్గొని పార్టీ మ్యానిఫెస్టోను విస్తృతంగా ప్రచారం చేశారు.ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ నీతి నిజాయితీ కలిగిన వ్యక్తి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అని కొనియాడారు.జనసేన పార్టీ అధికారంలోకి వస్తే గృహిణులకు ఉచిత గ్యాస్ సిలెండర్ మరియు నగదు బదిలీ పథకం క్రింద 2500 నుండి 3500 వరకు మహిళల ఖాతాలో జమ వంటి అంశాలను తెలిపారు. ఒకటో తరగతి నుండి పి జి వరకు ఉచిత విద్యను అందచేస్తామని. స్థానిక సమస్యలపై ఉద్యమం చేస్తామని భరోసా కలిపించారు. రానున్న ఎన్నికల్లో తమరు మీ అమూల్యమైన ఓటును జనసేన వామపక్షాల ఉమ్మడి అభ్యర్థికి వేసి ఆఖండ మెజారిటీ అందించాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa