బాపట్ల రైలుపేట మూడవ వార్డులోని నల్లమడ రోడ్డులో మంగళవారం మన వార్డు - మన ఎమ్మెల్యే" కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ పాల్గొని వార్డులోని ప్రజలతో సమావేశమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులతో స్థానిక అభివృద్ధి పనులపై సమీక్ష జరిపారు. ప్రజల తాగునీరు, రోడ్లు, డ్రైనేజ్ వంటి అంశాల్లో తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa