ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరో గచ్చిబౌలిగా మంగళగిరి: లోకేశ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 15, 2019, 10:28 PM

మరో గచ్చిబౌలిగా మంగళగిరిని తీర్చిదిద్దుతానని  ఏపీ మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారు.  మంగళగిరి బహిరంగ సభలో మాట్లాడిన ఆయన.. మంగళగిరి నియోజకవర్గ అభ్యర్థిగా తాను నిలబడ్డానని.. భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. రానున్న ఐదేళ్లలో ఐటీ పరిశ్రమలను మరిన్ని ఏర్పాటు చేస్తామన్నారు.  యువతీ, యువకులకు సొంత జిల్లాలోనే ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని  ఐటీ మంత్రిగా మంగళగిరికి ఐటీ పరిశ్రమలను పెద్ద ఎత్తున తీసుకువస్తున్నానని చెప్పారు.  రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాల కోసం ఒక పక్కన కృషి చేస్తూనే.. మరోపక్క పరిశ్రమల స్థాపనకు సీఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఏపీ మంత్రి లోకేశ్ అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa