జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు చేసిన మారణహోమం గురించి అందరికీ తెలిసిందే. ఈ ఘటనలో అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా.. మరెంతో మంది తీవ్రంగా గాయపడి నరకం చూస్తున్నారు. అయితే క్షేమంగా బయటపడ్డ వారు మాత్రం హమ్మయ్యా అనుకుంటున్నారు. కానీ అక్కడ జరిగిన దాడులను పదే పదే తలుచుకుంటూ ఇప్పటికీ వణికిపోతున్నారు. ముఖ్యంగా కేరళకు చెందిన నలుగులు ఎమ్మెల్యేలు, ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తులు పర్యటన నిమిత్తం జమ్ము కశ్మీర్ వెళ్లగా.. త్రుటిలో ముష్కరుల నుంచి తప్పించుకున్నట్లు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
మంగళ వారం రోజు పహల్గాం సమీప బైసరన్ లోయలో భీకర ఉగ్రదాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే సైనిక దుస్తులు ధరించి వచ్చిన ఉగ్రవాదులు పర్యటకులపై కాల్పులు జరపగా.. 28 మంది ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది తీవ్రంగా గాయపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ముఖ్యంగా కేరళలోని కొచ్చి ఎడపల్లికి చెందిన ఎన్. రామచంద్రన్ సైతం ఈ కాల్పుల్లో చనిపోయారు. అయితే తాజాగా ఈ ఘటనపై స్పందించిన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రామచంద్రన్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోవడం తనను ఎంతగానో కలిచి వేసిందని అన్నారు. అలాగే ఆయన కుమార్తె ఆరతి, ఆమె పిల్లలు అక్కడే ఉండగా.. వారిని జాగ్రత్తగా ఇంటికి చేర్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగానే మాట్లాడుతూ.. కేరళ హైకోర్టు న్యాయమూర్తులు.. జస్టిస్ అనిల్ కే నరేంద్రన్, జస్టిస్ పీజీ అజిత్ కుమార్, జస్టిస్ జి. గిరీష్‌లు జమ్ము కశ్మీర్ వెళ్లారని చెప్పారు. అలాగే నలుగురు ఎమ్మెల్యేలు ముకేశ్, కేపీఏ మజీద్, టి సిద్ధిక్, కె అన్నాలన్ కూడా వెకేషన్ కోసం అక్కడికి వెళ్లారని వివరించారు. అయితే ఈ ఏడుగురు ఉగ్రవాదుల దాడి నుంచి త్రుటిలో తప్పించుకున్నారని.. ప్రస్తతం వీరంతా శ్రీనగర్‌లో క్షేమంగా ఉన్నారని పీఎం పినరయి విజయన్ చెప్పుకొచ్చారు. వీరంతా గురువారం రోజు స్వరాష్ట్రానికి తిరిగి రాబోతున్నారని పేర్కొన్నారు.
మరోవైపు జమ్ము కశ్మీర్‌లో చిక్కుకున్న రాష్ట్ర ప్రజలను సురక్షితంగా రాష్ట్రానికి చేర్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఇది మాత్రమే కాకుండా కేరళ పర్యాటకుల కోసం నోర్కా గ్లోబల్ కాంటాక్ట్ నెంబర్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. టోల్ ఫ్రీ నెంబర్లను సైతం రిలీజ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa