ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అది మాత్రం ఖాయం: కేశినేని నాని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 24, 2025, 07:30 PM

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉర్సా క్లస్టర్ భూముల కేటాయింపు వ్యవహారం కలకలంరేపుతోంది. ఏపీ ప్రభుత్వం రూ. 3,000 కోట్ల విలువైన భూమిని చాలా తక్కువ ధరకు ఇచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అసలు7 నెలల ముందు అమెరికాలో ప్రారంభించిన ఈ ఉర్సా క్లస్టర్ కంపెనీకి 60 ఎకరాల భూమి ఎలా కేటాయించారనే ప్రశ్నలు మొదలయ్యాయి. అయితే ఈ భూముల్ని దక్కించుకున్న ఉర్సా క్లస్టర్‌కు చెందిన ప్రమోటర్లు జూమ్ కాల్‌లో మాట్లాడి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాము ఏపీ ప్రభుత్వం నుంచి తీసుకున్న భూమి విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతోందని.. తాము ఎకరా భూమిని 99 పైసలకు తీసుకోలేదని తెలిపారు. ఆ భూమిని మార్కెట్ ధరలకే తీసుకున్నట్లు క్లారిటీ ఇచ్చారు. తమది కొత్తగా రిజిస్ట్రర్ అయిన కంపెనీ అయినా.. తమ టీమ్‌లో అనుభవజ్ఞులైన సభ్యులు ఉన్నారని చెప్పుకొచ్చారు.


ఈ ఉర్సా భూముల అంశంపై మాజీ ఎంపీ కేశినేని నాని.. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని టార్గెట్‌గా విమర్శలు చేశారు. ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎంపీ చిన్ని బినామీ కంపెనీ అంటూ ఎక్స్ వేదికగా ఆరోపణలు చేశారు కేశినేని నాని. అలాగే కేశినేని చిన్ని కొన్ని అక్రమాలు చేస్తున్నారంటూ మరోసారి టార్గెట్ చేశారు. దీంతో విజయవాడలో కేశినేని బ్రదర్స్ మధ్య సోషల్ మీడియా వార్ మొదలైంది. కేశినేని నాని ట్వీట్‌లకు తమ్ముడు కేశినేని చిన్ని ఘాటుగానే రిప్లై ఇచ్చారు. 'ఎన్టీఆర్ జిల్లా ప్రజలకు ముఖ్య గమనిక.సోషల్ మీడియా రోడ్ల మీద మతి బ్రమించి తిరుగుతున్న సైకో.చిప్పు దొబ్బి సోషల్ వాల్స్ పై కసి,పగ, ద్వేషంతో రగిలిపోతూ విజయవాడ అభివృద్ధిపై విషం చిమ్ముతున్న సైకో.స్పందించాల్సిన అవసరం లేదు. అప్రమత్తంగా ఉండండి' అంటూ చిన్ని కౌంటరిచ్చారు. అలాగే వైఎస్సార్‌సీపీ నేతలు చేస్తున్న విమర్శలకు కేశినేని చిన్ని కౌంటర్లు ఇస్తున్నారు.


తాజాగా మరోసారి కేశినేని నాని విజయవాడ ఎంపీ చిన్నిని టార్గెట్ చేశారు.. మరోసారి ఉర్సా భూముల అంశాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. 'ఎవరు ఎన్ని జూమ్ మీటింగులు పెట్టి వివరణలు ఇచ్చినా నన్ను ఎవరు ఎన్ని బూతులు తిట్టినా చిప్ దో.. ది అన్నా సైకో అన్నా నో ప్రాబ్లెమ్ ఒకటైతే ఖాయం.. #URSAClusters..Vizag is for sale అంటూ మరోసారి ఆరోపణలు చేశారు. మరి కేశినేని నాని ట్వీట్‌కు చిన్ని ఎలా కౌంటరిస్తారో చూడాలి.


అన్నదమ్ముల మధ్య ట్వీట్ వార్ సంగతి ఇలా ఉంటే.. కేశినేని నానికి మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కూడా కౌంటరిచ్చారు. 'అయ్యా కేశినేని నాని.. నీకు ఎంపీ సీట్ ఇవ్వలేదని ముందు నుంచు నీ తమ్ముడిపై ఏదో ఒక ఆరోపణలు చేస్తూనే ఉన్నావు. నాడు నీ సొంత తమ్ముడి భార్యపైన కేసు పెట్టావు. నేడు చంద్రబాబు గారు చేస్తున్న అభివృద్ధికి అడ్డుపడుతున్నావా?. కేశినేని శివనాథ్ గారి ఇంజనీరింగ్ క్లాస్ మెట్ కంపెనీకి ల్యాండ్ ఇవ్వకూడదు అని అడ్డుపడుతున్నావు. బ్యాంకులకు రుణాలు కట్టవలసి వస్తుందని కార్మికులకు జీతాలు చెల్లించవలసి వస్తుందని ట్రావెల్స్ బోర్డు తిప్పేసి, కొన్ని వేల కోట్లకి పంగనామం పెట్టిన నువ్వా ఇలాంటి నీతులు చెప్తుంది? . ఎవరెవరికి ఏం చెయ్యాలో, ఏ పరిశ్రమలను ఎలా తీసుకురావాలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి బాగా తెలుసు..! . మధ్యలో నీ ఉపన్యాసాలు వినే తీరిక, నీతో చెప్పించుకునేంత కర్మ చంద్రబాబు గారికి లేదు! . జగన్ పక్కన చేరావు అని ప్రజలు నిన్ను చీ కొట్టారు.. మర్చిపోయావా? . రాజకీయాలు నుండి దురమయిపోతున్నా అని చెప్పి నేడు మళ్ళీ ఏం ఆశించి ఇలాంటి ట్వీట్లు పెడుతున్నావ్..?' ట్వీట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa