ఏపీలోని కూటమి ప్రభుత్వం శనివారం నుంచి 'మత్స్యకార భరోసా' నిధులను అకౌంట్లలో జమ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.
మత్స్యకారులకు చేపల వేట నిషేధ సమయంలో ఇచ్చే భృతి కింద అర్హులైన మత్స్యకారులకు రూ.20 వేలు అందిస్తామని ఇప్పటికే ప్రకటించింది. ఈ పథకం కింద 1,22,968 మంది జాలర్లకు లబ్ధి చేకూరనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa