కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల సన్నాహక ప్రత్యేక సర్వసభ్య సమావేశం ఈ నెల 18న నిర్వహించనున్నట్లు టిడిపి జిల్లా అధ్యక్షులు బచ్చుల అర్జునుడు తెలిపారు. విజయవాడ నగరానికి సమీపంలోని కానూరు సిద్ధార్ధా ఇంజనీరింగ్ కళాశాల (మహానాడు జరిగిన ప్రదేశం)లో సోమవారం సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ సమావేశానికి ముఖ్యఅతిధిగా టిడిపి జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరవుతారని చెప్పారు. విజయవాడలోని టిడిపి జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల అభ్యర్ధులు టిడిపి నిబంధనలకు అనుగుణంగా ప్రమాణం చేస్తారని, అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సందేశం ఇవ్వనున్నారని చెప్పారు.
ఈ కార్యక్రమానికి ప్రతి నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు, ఏరియా కోఆర్డినేటర్లు, బూత్ కమిటీ కన్వీనర్లు, సేవామిత్రలు, ఇతర అతి ముఖ్యనాయకులు హాజరు కావాలని కోరారు. జిల్లా నుంచి 35 వేల మంది నాయకులు, కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. అన్ని నియోజకవర్గాల నాయకులు అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ వేదిక నుంచి ఎన్నికల్లో కార్యకర్తలు, నాయకుల అనుసంధించాల్సిన విధివిధానాలపై సిఎం చంద్రబాబునాయుడు దిశానిర్ధేశం చేస్తారని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa