రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో జిల్లా వ్యాప్తంగా పోలీస్, ఎక్సైజ్, ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎక్సైజ్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం శనివారం కృష్ణ జిల్లాలో రూ. 18 లక్షల విలువ చేసే మద్యం స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని బంటూమిలి మండలంలో లక్ష్మీపురం గ్రామంలో అధికారులు తనిఖీచేస్తుండగా.. లెక్కల్లో చూపని ఈ మద్యంను పట్టుకున్నారు. ఎన్నికల్లో కార్యకర్తలకు మద్యం సరఫరాచేయడానికే నిలవ ఉంచినట్టు పేర్కొన్నారు. కాగా, ఇది ఓ వైన్ దుకాణం నుండి సీసాలు మళ్ళించి అక్రమంగా నిలువ ఉంచారని అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa