ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటానని ఒంటరిగా కదిలిన నన్ను అవహేళన చేసిన చంద్రబాబు. ఇప్పుడు తనను చూసి భయపడే పరిస్థితికి చేరుకున్నాడని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ లో ఎన్నికల సమరశంఖారావసభలో ఆయన మాట్లాడుతూ. . తెలంగాణ ఉద్యంలోకి దిగిన నాడు తను ఒంటరిగానే ముందడుగు వేసినప్పుడు మగల పుట్టింది.. దుబ్బల పోతదిలే అని చంద్రబాబు తో సహా కాంగ్రెస్ నేతలు కూడా అనుకున్నారని , ‘‘తెలంగాణలో కేసీఆర్‌తో ఏం అవుతది..అన్న కాంగ్రెస్ పార్టీ యే కాదు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో ఏం జరిగినా కర్త, కర్మ, క్రియ అన్నీ తానేనని చెప్పుకున్న చంద్రబాబు పరిస్థితేంటో జనం అర్ధం చేసుకోవాలన్నారు. గడిచిన మూడు నెలల నుంచి చంద్రబాబు నన్ను మూడువేల తిట్లు తిట్టారు, ఆంధ్రాలో ఓడిస్తానని అదే తన రిటన్ గిఫ్ట్ అన్న భయం చంద్రబాబును పట్టుకుందని అందుకే నన్ను చూసి భయపడుతున్నాడని ఎద్దేవా చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa