ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంగళగిరిని మరో సైబరాబాద్‌ను చేస్తా: లోకేష్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 17, 2019, 08:26 PM

మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళగిరిని మరో సైబరాబాద్‌ను చేస్తానని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు దయ వల్ల మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నానని మంత్రి లోకేష్‌ చెప్పారు. ‘‘పార్లమెంట్‌లో నీ సంగతి చూస్తానని ఎంపీ జయదేవ్‌ను ప్రధాని మోదీ బెదిరించారు. జయదేవ్‌తో పెట్టుకుంటే ప్రధానికి కూడా షాక్‌ కొడుతుంది’’ అని లోకేష్‌ హెచ్చరించారు. . మంగళగిరిలో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మిస్తామని, వచ్చే 18 నెలల్లో ఇంటింటికి మంచి నీరు అందిస్తామని చెప్పారు.
చంద్రబాబు స్పీడ్‌ను తాము అందుకోలేకపోతున్నామని, విభజన చేసిన వాళ్లు అసూయపడేలా పునర్మిర్మాణం చేస్తున్నామన్నారు. జగన్‌, కేసీఆర్‌, మోదీ కలిసి చంద్రబాబును ఓడించాలని కుట్ర పన్నుతున్నారని, మోదీకి వ్యతిరేకంగా జగన్‌ ఒక్క మాట మాట్లాడరని ఆయన దుయ్యబట్టారు. వైసీపీ ఎంపీలు వీధి నాటకాలాడుతున్నారని, చంద్రబాబుకు హత్య రాజకీయాలు తెలియవని, ఎంపీ వివేకా హత్య కేసులో తమపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని లోకేష్‌ విమర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa