పశ్చిమగోదావరి జిల్లా భీమడోలులో నిర్వహించిన తెదేపా బూత్ కన్వీనర్ల సభలో చంద్రబాబు మాట్లాడారు. గత ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లాలోని మొత్తం స్థానాలను తెదేపా కూటమికే కట్టబెట్టారని ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు అన్నారు. కార్యకర్తల త్యాగాల వల్లే తమకు గుర్తింపు వచ్చిందని.. తనకు కుటుంబం కంటే కార్యకర్తలే ఎక్కువని చెప్పారు. కార్యకర్తలకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. పశ్చిమగోదావరి జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత తనది చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa